
ప్రతి ఐపీఎల్ ఎడిషన్ ప్రారంభానికి ముందు బీసీసీఐ గ్రాండ్ ఓపెనింగ్ వేడుకను నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా, విదేశాల నుంచి స్టార్ కళాకారులను బీసీసీఐ ఆహ్వానిస్తుంది. బాలీవుడ్ స్టార్ నటి దిశా పటాని, ప్రముఖ నేపథ్య గాయని శ్రేయా ఘోషల్, పంజాబీ గాయకుడు కరణ్ ఔజ్లా ఈ కార్యక్రమంలో ప్రదర్శన ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ స్టార్ ప్రదర్శనలతో పాటు, అనేక ఇతర కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు.