బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను జట్టు నుంచి రిలీజ్ చేయాలని ఐపీఎల్ ఫ్రాంచైజీ కేకేఆర్‌ను బీసీసీఐ ఆదేశించింది. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడుల నేపథ్యంలో ముస్తాఫిజుర్‌ను ఐపీఎల్‌లో ఆడించొద్దని డిమాండ్లు వినిపించిన సంగతి తెలిసిందే. ‘బంగ్లాదేశ్‌లో తాజా పరిణామాల దృష్ట్యా ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను రిలీజ్ చేయాలని కేకేఆర్‌ను ఆదేశించాం. అతడి స్థానంలో వేరే ఆటగాడిని రిప్లేస్ చేసుకోవచ్చని వెల్లడించాం’ అని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా చెప్పుకొచ్చారు.

