కొత్త జీఎస్టీ శ్లాబులు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) వంటి క్రికెట్ ఈవెంట్లపై భారీ ప్రభావం పడే అవకాశం ఉంది. ఇకపై ఐపీఎల్ స్పోర్ట్స్ ఈవెంట్ల టికెట్ల విక్రయాలపై 40శాతం జీఎస్టీ విధించనున్నారు. 40శాతం రేటు ఐపీఎల్ వంటి ఈవెంట్లకు మాత్రమే వర్తించనున్నది. రూ.500 కంటే ఎక్కువ ధర ఉన్న టిక్కెట్లపై 18 శాతం చొప్పున జీఎస్టీ కొనసాగుతుంది. అంటే, జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన క్రీడా టోర్నమెంట్ల ప్రేక్షకులపై ఎటువంటి అదనపు భారం ఉండదన్న మాట.

