
సీజన్లో చివరి డబుల్ హెడర్ గుజరాత్ టైటాన్స్ , చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది. మహేంద్ర సింగ్ ధోనీ వయసు, ఫిట్నెస్ దృష్ట్యా ఇదే అతనికి చివరి ఐపీఎల్ సీజన్ కావచ్చని గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. గుజరాత్ టైటాన్స్‌తో జరిగే మ్యాచ్ ధోనీకి నిజంగానే చివరి ఐపీఎల్ మ్యాచ్ అయితే, ఆ సందర్భాన్ని చిరస్మరణీయం చేయాలని సీఎస్కే జట్టు భావిస్తోంది. ఆటగాళ్లందరూ ‘తలా’ కోసం ఒక్కటై, తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి, విజయాన్ని అందించాలని పట్టుదలగా ఉన్నారు.