
మధ్యప్రదేశ్ లోకాయుక్త అధికారులు రిటైర్డ్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (PWD) చీఫ్ ఇంజనీర్ GP మెహ్రా ఇళ్లు, ఆఫీసులపై దాడులు చేశారు. ఈ దాడులు పెద్ద ఎత్తున అక్రమాస్తులు బయటపడ్డాయి. మొత్తం రూ.36.04 లక్షల నగదు, 2.649 కేజీల బంగారు, 5.523 కేజీల వెండి, అనేక ఫిక్స్‌డ్ డిపాజిట్లు, బీమా పాలసీలు, షేర్ల డాక్యుమెంట్లు, ఫామ్‌హౌస్‌లో 17 టన్నుల తేనే దొరికింది. మొత్తం ఆస్తుల విలువ ఎన్ని కోట్ల రూపాయలకు చేరుకుంటుందో అంచనా వేయడానికి ఫోరెన్సిక్ టీమ్‌లు డాక్యుమెంట్లు, డిజిటల్ రికార్డులను పరిశీలిస్తున్నారు.