ముఖ్యమంత్రి చంద్రబాబు ఏలూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం ఉంగుటూరు మండలం గొల్లగూడెం, నల్లమాడ, గోపీనాథపట్నంలోని పలు కార్యక్రమాలకు హాజరయ్యారు. గోపీనాథపట్నంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు. గుడ్ల నాగలక్ష్మి అనే మహిళకు పింఛను అందించారు. నల్లమాడలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొననున్నారు. బహిరంగ సభ అనంతరం గొల్లగూడెంలో పార్టీ కార్యకర్తలతో సీఎం సమావేశమయ్యారు.

