ఏపీలో ఏలూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు ట్రావెల్‌కు చెందిన బస్సు బోల్తాపడింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రయాణికుడు ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు గాయపడ్డారు. లింగపాలెం మండలం జూబ్లీనగర్ దగ్గర ఈ ఘటన సోమవారం రాత్రి జరిగింది. ఈ బస్సును భారతి ట్రావెల్స్‌కు చెందిన బస్సుగా గుర్తించారు. ప్రస్తుతం సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరో పది మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
      
