
ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడం ఎక్కువైపోయిందని ఏపీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఫేక్ న్యూస్ కట్టడికి ప్రత్యేక చట్టం తీసుకు రావాలని నిర్ణయించింది. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టుల నివారణకు సీఎం మంత్రి వర్గ సమావేశంలో చర్చించారు. మంత్రులు అనిత, నాదెండ్ల, అనగాని, పార్థసారధితో ఉపసంఘం ఏర్పాటు చేశా. కొత్త చట్టం తీసుకొచ్చేందుకు నిబంధనలను రూపొందించనున్నారు. తప్పుడు పోస్టులు పెట్టేవారిపై కఠిన చర్యలు ఉండేలా చట్టం ఉండాలని సీఎం చంద్రబాబు ఉపసంఘ సభ్యులకు సూచించారు.