
ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం బుధవారం విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ను విజయవాడలో కలుసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విద్యా కార్యక్రమాలపై వారు ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా కొత్త ప్రభుత్వం వినూత్న విద్యా పథకాలకు ప్రాధాన్యతనిస్తున్నదని వారు అభిప్రాయపడ్డారు. “ఆంధ్రప్రదేశ్‌ను FLN సాధనలో ప్రపంచానికి మార్గదర్శకంగా నిలబెడతాం” అని లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు. సమగ్ర శిక్ష, సాల్ట్ వంటి పథకాలతో రాష్ట్ర విద్యారంగ అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు వెళ్తుందని స్పష్టంచేశారు.