
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఇళ్లు, ఆఫీసుల్లో ఏపీ పోలీసులు సోదాలు చేపట్టారు. ఏపీ లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి నిందితుడిగా ఉండగా… సిట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, తిరుపతిలలో మిథున్ రెడ్డి నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. అలాగే సోమాజిగూడలోని డికాట్ కొరియర్ కంపెనీలోనూ సిట్ అధికారుల సోదాలు చేపట్టారు. డికాట్ కొరియర్ నుంచి మిథున్ రెడ్డికి చెందిన పీఎల్ఎఆర్ ప్రాజెక్టులోకి రూ. 25 కోట్లు వచ్చినట్లు సిట్ అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తోంది.