ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ4గా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు శుక్రవారం కొట్టివేసింది. ఈ క్రమంలోనే మిథున్ రెడ్డి ఈరోజు విజయవాడ చేరుకుని సిట్ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలోనే మిథున్ రెడ్డిని ఆరు గంటల పాటు విచారించిన అధికారులు అనంతరం నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేశారు.

