
ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్ సిద్ధార్థ్ కౌశల్ వీఆర్ఎస్ కు దరఖాస్తు చేయడంతో ప్రభుత్వ వేధింపుల కారణంగానే రాజీనామా చేస్తున్నట్లుగా వైసీపీ నేతలు ప్రచారం ప్రారంభించారు. దీంతో సిద్దర్థ కౌశల్ ఓ లేఖ విడుదల చేశారు. స్వచ్ఛంద పదవీ విరమణ చేయాలనే తన నిర్ణయం వ్యక్తిగత కారణాలు, అలాగే కుటుంబ ప్రాధాన్యతల కారణంగా వీఆర్ఎస్ నిర్ణయం తీసుకున్నాననిప్రకటించారు. వేధింపులు లేదా ఇతర బలవంతం కారణంగా తన రాజీనామా జరిగిందనే ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు, అలాంటి వాదనలను “నిరాధారమైనవి, తప్పుదారి పట్టించేవి” అని ఆయన స్పష్టం చేశారు.