
్వార్ట్జ్ అక్రమాల కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్‌రెడ్డిని ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు, రవాణా, నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగం వంటి అక్రమాలపై పొదలకూరు పోలీసుస్టేషన్‌లో ఆయనపై ఫిబ్రవరిలో కేసు నమోదైంది. నెల్లూరు పోలీసుల సెర్చింగ్‌తో అజ్ఞాతంలోకి వెళ్లిన ఆయనకు సుప్రీంకోర్టులో కూడా ఎదురుదెబ్బ తగిలింది. క్వార్ట్జ్ గనుల అక్రమ తవ్వకాల కేసులో ఆయన ముందస్తు బెయిల్ నిరాకరించింది సర్వోన్నత న్యాయస్థానం.