భీమవరంలో జరిగిన ఈవెంట్కు నిధి అగర్వాల్ ఏపీ ప్రభుత్వ వాహనంలో వచ్చిందంటూ వీడియోలు బాగా వైరలయ్యాయి. దీనిపై నిధి అగర్వాల్ ఎక్స్ వేదికగా వివరణ ఇచ్చారు. ఈవెంట్ నిర్వాహకులు నా కోసం కల్పించిన వాహనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానిది. అయితే దానిని ఏర్పాటు చేసే విషయంలో నా పాత్ర లేదు. ప్రభుత్వ అధికారులెవరూ నా కోసం ఎలాంటి వాహనం ప్రత్యేకంగా పంపలేదు. డ్రైవర్ తన తప్పును ఒప్పుకుంటూ ఓ వీడియోను రిలీజ్ చేశాడు. ప్రభుత్వ వాహనం ప్లేట్ పెట్టుకున్న మాట వాస్తవమేనంటూ అందులో వివరణ ఇచ్చాడు.

