ఆంధ్రప్రదేశ్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు (BSEAP) 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఎస్సెస్సీ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 6.5 లక్షల మంది పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ టైమ్ టేబుల్ ప్రకారం, పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరుగనున్నాయి. ప్రతిరోజూ ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షా సమయంగా పేర్కొన్నారు.
bse.ap.gov.in

