
శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన జవాన్ జమ్మూకశ్మీర్‌లో వీరమరణం పొందారు. గోరంట్ల మండలం గడ్డంతండా పంచాయతీ పరిధిలోని కల్లితండాకు చెందిన మురళీనాయక్ ప్రాణాలు కోల్పోయినట్లు కుటుంబ సభ్యులకు శుక్రవారం ఉదయం సమాచారం అందింది. సరిహద్దులో చొరబాటుదారుల కాల్పుల్లో మురళీనాయక్ ప్రాణాలు విడిచినట్లు అధికారులు వారి కుటుంబ సభ్యులకు తెలిపారు.