
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ బుధవారం జరిగిన సమావేశంలో పలు కీలక అభివృద్ధి నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ఆధునిక సాంకేతికత దిశగా పెద్ద అడుగులుగా భావిస్తున్న అమరావతి
నగరంలో ‘క్వాంటం కంప్యూటింగ్ సెంటర్’ స్థాపనకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వైద్యరంగంలో రాష్ట్రానికి ముందంజ వేయించేందుకు నక్కపల్లిలో ఏర్పాటు చేసిన బల్క్ డ్రగ్ పార్క్‌కు అదనంగా 790 ఎకరాల భూమిను సమీకరించేందుకు క్యాబినెట్ ఆమోదించింది.