కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రకారం వాణిజ్య అవసరాలకు 70 శాతం మేర గ్యాస్ అదనపు కోటాను కేటాయిస్తూ ఆదేశాలు ఇచ్చింది. వ్యాపారులు తమ అసోసియేషన్ పరిధిలో గ్యాస్ ఎంత మేర అవసరమో జిల్లా జాయింట్ కలెక్టర్లకు చెబితే, ప్రాధాన్యత ప్రకారం గ్యాస్ బండలను కేటాయించబోతున్నారు. రాష్ట్రంలో గ్యాస్, పెట్రోలు, డీజిల్ సరఫరా తీరు, వాస్తవ పరిస్థితి, అందుబాటులో ఉన్న నిల్వలపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, గ్యాస్ ఏజెన్సీలు, స్టేట్ కోఆర్డినేటర్లతో సమీక్షించారు.

