
సోషల్ మీడియాలో పోస్టులపై ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సాయంతో నకిలీ వీడియోలు సృష్టించి, వాటిని సోషల్ మీడియాలో పెట్టి గొడవలు రేకెత్తించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ప్రముఖ సాఫ్ట్వేర్, ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు జాతి, కులం, మతం, ప్రాంతం, భాష, వర్గాల ఆధారంగా విభేదాలు సృష్టించేలా పోస్టులు పెడుతున్నారని.. వారిపై బీఎన్ఎస్ 352(2) (3) సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామన్నారు