
ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ వైద్య సేవలకు మరోసారి అంతరాయం ఏర్పడనుంది. ప్రభుత్వం రావాల్సిన బకాయిలు ఇంకా విడుదల కాలేదని ఆర్థిక భారం పెరిగిందని నెట్వర్క్ ఆసుపత్రులు తెలిపాయి. ప్రభుత్వం నుంచి దాదాపు 2700 కోట్ల రూపాయలు రావాల్సి ఉందని వెల్లడించాయి. వాటిని చెల్లించే వరకు సేవలు కొనసాగించలేమని ఓ ప్రకటన చేశాయి. గత రెండు రోజులుగా అనేక సందర్భాల్లో ఆందోళన చేశామని ప్రజాప్రతినిధులను కలిశామని అయినా రావాల్సిన బకాయిలపై స్పందన లేదని అన్నారు.