రాష్ట్ర అభివృద్ధికి మౌలిక వసతులే బలమైన పునాది అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సచివాలయంలో రహదారులు & భవనాలు, రవాణా శాఖలపై ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా రహదారుల నిర్వహణను మెరుగుపరచడం, ప్రజలకు సురక్షిత ప్రయాణాన్ని అందించడంపై మంత్రులు బీసీ జనార్ధన్ రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ,ఉన్నతాధికారులతో కలిసి సీఎం విస్తృతంగా చర్చించారు. రాష్ట్రంలోని 45 వేల కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉన్న రహదారుల పరిస్థితిపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారు.

