
140 మంది ఒప్పంద, పొరుగుసేవల వైద్యులు, ఇతర సిబ్బంది హాజరు నమోదులో అవకతవకలకు పాల్పడ్డారని.. వారందరికి ఉద్యోగుల నుంచి ఉద్వాసన పలకాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ‘పట్టణాల్లో నివసించే వైద్యులు, ఇతర సిబ్బంది సకాలంలో ఆసుపత్రులకు చేరుకోవడం లేదు.. అయినా నిర్ణీత సమయంలోనే విధులకు వచ్చినట్లు సమయ వేళలను ఐ-ఫోన్ సాంకేతికతతో మార్చారు. ఈ విషయాన్ని అధికారులు గుర్తించారు’..