
ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిచిపోయాయి. రూ.3,500 కోట్ల బకాయిలు పెండింగ్ ఉన్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్ వైద్య సేవ సీఈవోకు నెట్ వర్క్ నోటీసులు ఇచ్చింది. 600 ఆస్పత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిచిపోయాయి.పేరుకు ఏపీ రైజింగ్ స్టేట్.. కానీ వైద్య సేవలకు దిక్కులేదు. పేదోడి ఆరోగ్యానికి రాష్ట్రంలో భరోసా లేదు అని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ప్రజారోగ్యంపై కూటమి ప్రభుత్వానిది అంతులేని నిర్లక్ష్యం.ఆరోగ్య శ్రీ పథకానికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలని కాంగ్రెస్ పార్టీ తరపున కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం’ అన్నారు.