సీఎం చంద్రబాబు రాష్ట్ర సచివాలయంలో వైద్యారోగ్య శాఖపై సమీక్షించారు. ఈ మేరకు గేట్స్ ఫౌండేషన్ తో కలిసి వైద్యారోగ్య రంగంలో ప్రభుత్వం అమలు చేస్తోన్న సంజీవని సహా వివిధ ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు చర్చించారు. ‘వైద్యారోగ్య రంగంలో వివిధ ప్రమాణాలను అందుకునేలా డబ్ల్యూహెచ్ఓ లాంటి సంస్థలు నిర్దేశించిన అంశాలను అమలు చేస్తున్నాం. ప్రజల డిజిటల్ హెల్త్ రికార్డులను సంజీవని ప్రాజెక్టు ద్వారా రూపొందిస్తున్నాం’అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

