
చేనేతల ఆర్థిక వృద్ధికి మరో కీలక పథకం ఉచిత విద్యుత్ పథకానికి సీఎం చంద్రబాబునాయుడు పచ్చజెండా ఊపారు. రాష్ట్రంలో మగ్గాల మీద 50 వేల నేతన్నలు, మర మగ్గాలపై 11,500ల మంది ఆదారపడి జీవిస్తున్నారు. వారందరికీ ఉచిత విద్యుత్ పథకం వర్తింపజేసేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. మగ్గాలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500ల ఉచితంగా అందజేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వంపై ఏటా రూ.125 కోట్ల మేర భారం పడనుంది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలకు కూటమి ప్రభుత్వం గిఫ్ట్ అందజేసింది.