సోషల్ మీడియా బ్యాన్‌పై ఏపీ విద్య,ఐటీ,ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా బ్యాన్‌పై స్టడీ చేస్తున్నట్లు ప్రకటించారు. దావోస్ పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేశ్ బ్లూమ్‌బర్గ్‌తో మాట్లాడారు.
16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగించకుండా నిషేధం విధించాలని యోచిస్తున్నట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం అమలు చేసిన సోషల్ మీడియా బ్యాన్ నమూనాను ఏపీలో కూడా అధ్యయనం చేస్తున్నట్లు మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు.

