కర్నూలు జిల్లా పరిధిలో శనివారం ఉదయం రెండు రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిధిలోని కొటేకల్ గ్రామం వద్ద ఓ ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రెండు కార్లు ఢీకొన్న ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా మొత్తం ఐదుగురు మృత్యువాత పడ్డారు . మరో నలుగురు గాయపడ్డారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వీరిని కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా చిక్కహోసల్లి

