
ఆంధ్రప్రదేశ్ బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ఇం టర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (IPE) 2026 షెడ్యూల్ను విడుదల చేసింది. ఈసారి ఫిబ్రవరి నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి. థియరీ పరీక్షలు 23 ఫిబ్రవరి 2026 నుంచి 24 మార్చి 2026 వరకు జరుగనున్నాయి. ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 10 నుంచి 20 వరకు నిర్వహించనున్నారు. ఈ మార్పులతో విద్యార్థులు CBSEతో సమానంగా సిలబస్ పూర్తి చేసి, ఏప్రిల్ నుంచే కొత్త అకడమిక్ ఇయర్ ప్రారంభం చేయవచ్చు.