
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అపార వనరులున్నాయని…వ్యాపార అభివృద్ధికి పెద్ద ఎత్తున అవకాశాలు ఉన్నాయని, పెట్టుబడులతో వచ్చి రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్‌లోని వివిధ దిగ్గజ సంస్థల ప్రతినిధులను కోరారు. సింగపూర్ పర్యటన చివరి రోజున పలు కంపెనీలకు చెందిన ప్రముఖులతో సీఎం చంద్రబాబు వరుస భేటీలు నిర్వహించారు. హైదరాబాద్-బెంగళూరు-అమరావతి-చెన్నైల మధ్య ఎయిర్ పోర్టు ఎకనమిక్ కారిడార్ గురించి సీఎం ఆ సంస్థ ప్రతినిధులకు చెప్పారు.