విజయవాడలో లులు మాల్ నిర్మాణం కోసం పాత బస్ డిపోలో ఐదు ఎకరాల భూమిని అప్పగించాలనే ప్రతిపాదన రాగా.. ఈ ప్రతిపాదనపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వందల కోట్ల విలువైన ఆర్టీసీ ఆస్తిని ప్రైవేట్ సంస్థకు ఎలా అప్పగిస్తారంటూ ఆర్టీసీ ఉద్యోగులు మండిపడుతున్నారు. డిపో బదులుగా గొల్లపూడి ప్రాంతంలో ఐదు ఎకరాల భూమిని అందిస్తామని ఏపీఐఐసీ హామీ ఇచ్చినట్లు తెలిసింది. 200 మంది మహిళా కండక్టర్ల, 1,000 మంది ఆర్టీసీ ఉద్యోగుల భవితవ్యం ప్రశ్నార్థకం అవుతుందని ఆర్టీసీ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.

