
శేషాచలం అడవుల్లోకి అక్రమంగా ప్రవేశించే వారి భరతం పట్టేందుకు అటవీ శాఖ సమాయత్తమైంది. కొండలు, గుట్టలు దాటి సాహస యాత్రలకు వెళ్లే ముఠాలపై నిఘా పెట్టింది. నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం ఖబడ్దార్! తలకోన, అన్నమయ్య జిల్లాల్లోని అటవీ ప్రాంతాల్లో రహస్యంగా ట్రెక్కింగ్ నిర్వహిస్తున్న వారి గుట్టు రట్టు చేసేందుకు ప్రత్యేక కమిషన్ రంగంలోకి దిగింది. సోషల్ మీడియా ద్వారా ట్రెక్కర్లను ఆకర్షిస్తూ డబ్బులు వసూలు చేస్తున్న ట్రెక్కింగ్ సంస్థలపై చర్యలు తీసుకోవడానికి అటవీ శాఖ సిద్ధమవుతోంది.