
మాధ్యూఫిలిప్ అనేవ్యక్తి బెంగళూరు నార్త్ సైడ్ ఎక్కువ ఐటీ కంపెనీలకు ప్రోత్సాహం ఇవ్వాల్సి ఉందని అన్నారు. దీనికి లోకేష్ స్పందించారు. బెంగళూరు నార్త్ సైడ్ కు సమీపంలోనే అనంతపురం ఉంటుందని .. పెట్టుబడులకు ఆహ్వానించారు. ఇదే ప్రియాంక్ ఖర్గేకు కోపం తెప్పించింది. కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే ఏపీని కించపరుస్తూ ఓ ట్వీట్ పెట్టారు. బెంగళూరు ఆర్థిక ప్రగతి GDP 8.5% వృద్ధి, ఆస్తి మార్కెట్ 5% పెరుగుదల ఉందని.. . ఆంధ్రప్రదేశ్‌ను దెబ్బతిన్న ప్రాణులు బలమైనవాటి మీద ఆధారపడి బతుకుతాయని.. “పారాసైట్” అని వ్యాఖ్యానించారు.