
అమరావతి రాజధాని నిర్మాణానికి మరింత ఊతం ఇచ్చేలా కీలక ప్రకటన చేసింది. రెవెన్యూలోటుతో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రానికి ఉపశమనం కలిగించేలా మంచి శుభవార్త అందించింది. అమరావతి గ్రీన్ఫీల్డ్ రాజధాని నిర్మాణం కోసం వరల్డ్ బ్యాంక్, ఏడీబీ లాంటి సంస్థల ద్వారా తీసుకున్న రూ.15,000 కోట్ల రుణాన్ని కేంద్ర ప్రభుత్వం గ్రాంటుగా మార్చాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ రుణం ‘ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టుల’ కింద రాష్ట్ర అప్పుగా నమోదు కాకపోవడం వల్ల ఇది తుది నిర్ణయంగా తెలుస్తోంది.