 
		భారత దేశ ఐక్యతా స్ఫూర్తికి ప్రతీక అయిన సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో తెలంగాణ పోలీస్ శాఖ అధ్వర్యంలో ‘రన్ ఫర్ యూనిటీ’ కార్యక్రమం భారీ ఎత్తుతో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన చిరంజీవి జెండా ఊపి 2 కిలోమీటర్ల రన్‌ను ప్రారంభించారు. సర్దార్ పటేల్ దేశాన్ని 562 రాజ్యాలను ఏకీభవించి ఐక్య భారతదేశంగా నిర్మించిన గొప్ప నాయకుడనీ, ఆయన ఆశయాలను ప్రతి భారతీయుడూ గుర్తుంచుకోవాలని చిరంజీవి ప్రసంగించారు.
 
      
 
								 
								