బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర ఎన్నికల సంఘంపై మరోసారి విమర్శలు గుప్పించారు. “ఎన్నికల సంఘం 2002 నాటి ఓటర్ల జాబితాను డిజిటలైజ్ చేసింది. ఇందుకోసం ‘ఏఐ టూల్స్’ వినియోగించింది. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ఏఐ చేసిన తప్పుల వల్ల అర్హులైన, నిజమైన ఓటర్ల వివరాల్లో భారీగా తేడాలు వచ్చాయి. ఆ తప్పులను సాకుగా చూపి, అసలైన ఓటర్లను కూడా ‘లాజికల్ డిస్క్రిపెన్సీస్’ జాబితాలో చేర్చారు. దీనివల్ల లక్షలాది మంది సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు” అని అన్నారు.

