దేశ రాజధాని ఢిల్లీలో అంతర్జాతీయ స్థాయిలో భారత్ ఎఐ ఇంపాక్ట్ సమ్మిట్ సోమవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే భారీ సంఖ్యలో సందర్శకులు రావడంతో సరైన సౌకర్యాలు లేక ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు. భారీ క్యూలైన్లు, జనం రద్దీతో సదస్సు లోపలికి వెళ్లడం చాలా ఆలస్యం కావడంతో సామాజిక మాధ్యమంలో విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై కేంద్ర ఐటీ అండ్‌ఎలక్ట్రానిక్స్ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మంగళవారం అతిధులకు క్షమాపణలు చెప్పారు.

