వర్కింగ్ కల్చర్‌ను ఏఐ మార్చేస్తోంది. రాకెట్‌లా దూసుకెళ్తున్న ఏఐని ఇప్పుడు కొన్ని కంపెనీలు వరప్రసాదంలా భావిస్తున్నాయి. ఉద్యోగుల చేత ఏఐని తప్పనిసరిగా వాడేలా చేస్తున్నాయి. తాజాగా టెక్ కంపెనీ యాక్సెంచర్ ఈ విషయంలో ఉద్యోగులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా సీనియర్ ఉద్యోగులు ఏఐని తప్పనిసరిగా వాడాలని సూచించింది. లేకుంటే ప్రమోషన్లు కట్ చేస్తామని హెచ్చరించింది.

