దిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో యూఎన్ చీఫ్ ఆంటోనియో గుటెర్రెస్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ క్రమంలో ఏఐ రంగంలో భారత్ పాత్ర గురించి వ్యాఖ్యానించారు. భారత్‌లో తమ సంస్థ 15 బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెడుతోందని, అందులో భాగంగా పూర్తి స్థాయి ఏఐ హబ్‌ను ఏర్పాటు చేస్తోందని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ స్పష్టం చేశారు.

