అమెరికా టెక్నాలజీ దిగ్గజం ఐబీఏం.. 2030 నాటికి 50 లక్షల మంది భారతీయ యువతకు కృత్రిమ మేధ (ఏఐ), సైబర్ సెక్యూరిటీ, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి అత్యాధునిక సాంకేతికతల్లో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ‘ఐబీఏం స్కిల్స్బిల్డ్ ’ ప్లాట్ఫామ్ ద్వారా ఈ శిక్షణను అందించనుంది. కాగా ఇందుకోసం ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ)తో ఐబీఎం భాగస్వామాన్ని కుదుర్చుకుంది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా డిజిటల్ నైపుణ్యాలు, ఉపాధి సామర్థ్యాలను పెంపొందించేందుకు కట్టుబడి ఉన్నట్లు ఐబీఏం చైర్మన్, సీఈఓ అరవింద్ కృష్ణ తెలిపారు.

