ఏఐ సాయంతో గంటలోనే తిరుమల శ్రీవారి దర్శనం అసంభవమని వ్యాఖ్యనించిన మాజీ సీఎస్, టీటీడీ మాజీ ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం పై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏఐ టెక్నాలజీకిస్వస్తి పలకమని చెప్పడాన్ని ఖండిస్తు న్నట్లు తెలిపారు. ఏఐ టెక్నాలజీపై అవగాహన లేకుండా మాట్లాడడం బాధాకరమని అన్నారు. టీటీడీ దాతల సహాయంతో ఉచితంగా చేస్తున్న పనిని వృథా అనడం సరికాదన్నారు. భక్తులు షెడ్లు, కంపార్ట్మెంట్లలో పడిగాపులు కాయడం మంచిదా అంటూ ప్రశ్నించారు.

