
ఫ్రీలాన్స్ మార్కెట్ ప్లేస్ ఫైవర్ సీఈఓ మిచా కాఫ్మన్ తాజాగా ఏఐ గురించి కీలక హెచ్చరికలు జారీ చేశారు. ఏఐ కాలానికి తగినట్టుగా మార్పు చెందాలని కొత్త నైపుణ్యాలు అలవర్చుకోవాలని ఉద్యోగులకు సూచించారు. మనందరం వినడానికి ఇష్టపడని వాస్తవం ఇది. ఏఐతో మీ ఉద్యోగాలకు ముప్పు తప్పదు. నా జాబ్‌కు రిస్క్ పొంచి ఉంది. డిజైనర్, ప్రాడక్ట్ మేనేజర్, డాటా సైంటిస్ట్, లాయర్, కస్టమర్ సపోర్టు రిప్రజెంటేటివ్, సేల్స్‌పర్సన్, ఫైనాన్స్ ఉద్యోగి.. ఇలాంటి వారి జాబ్స్‌కు ఏఐ ముప్పు ఉంది.