
చిత్ర పరిశ్రమలో సంగీత దర్శకుడిగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు ఏఆర్ రెహమాన్. ఏ.ఆర్ రెహమాన్ కాపీరైట్ వివాదంలో చిక్కుకున్నాడు. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘పొన్నియిన్ సెల్వన్ – 2’ చిత్రంలోని “వీరా రాజా వీరా” పాట తన తండ్రి ఫయాజుదీన్ డగర్ మరియు మామ జాహిరుదీన్ డగర్ రాసిన ‘శివ స్తుతి’ నుంచి రూపొందించారని, తమ అనుమతి లేకుండా సంగీతాన్ని వినియోగించారని ఉస్తాద్ ఫయాజ్ వసిఫుదీన్ డగర్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ అనంతరం కోర్టు ఈ మధ్యంతర తీర్పును వెల్లడించింది.