హైదరాబాద్ శివారు ప్రాంతమైన యాచారంలో ఆదివారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లో భాగంగా వేగంగా వస్తున్న ఒక కారును ఆపాల్సిందిగా ఎస్ఐ మధు సైగ చేస్తూ ఎస్ఐ మధు ఆ కారుకు అడ్డుగా వెళ్లగా.. నిందితుడు ఏమాత్రం కనికరం లేకుండా ఆయనను ఢీకొట్టాడు. ఈ క్రమంలో ఎస్ఐ కారు బానెట్‌పై పడిపోగా.. డ్రైవర్ కారును ఆపకుండా అలాగే సుమారు వంద కిలోమీటర్ల వేగంతో ముందుకు దూసుకెళ్లాడు. ఈ ప్రమాదంలో ఎస్ఐకి తీవ్ర గాయాలు కాగా.. వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

