ఇవాళ పరిపూర్ణ కళాకారుడిని గుర్తు చేసుకుంటున్నామని, సినీ చరిత్రలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరు చిరస్థాయిగా ఉంటుందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. బాల సుబ్రహ్మణ్యం విగ్రహ ఏర్పాటు మన తెలుగు ప్రజలందరికీ గౌరవం అని భావిస్తున్నానని బండారు దత్తాత్రేయ తెలిపారు. బాలు ఓ కులం, ప్రాంతానికి చెందిన వ్యక్తి కాదని, సంగీతానికి ప్రాంతం, భాషా బేధం లేదని, ఎస్పీ అభిమానుల కోరిక మేరకు విగ్రహం ఏర్పాటు చేసినట్లు వివరించిన మంత్రి సంగీత ప్రపంచ రారాజు బాలు అంటూ మంత్రి శ్రీధర్ బాబు కొనియాడారు.

