సచివాలయంలో జరిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 12వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో 26 పరిశ్రమలకు సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూ.1,01,899 కోట్ల పెట్టుబడుల స్థాపనకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తెలిపారు. వీటి ద్వారా 85,870 ఉద్యోగాల కల్పన జరగనుంది. మూడు మెగా సిటీలు, 15 ఇండస్ట్రియల్ జోన్ల అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

