ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)పై చర్చ జరపాలని కోరుతున్న విపక్షాల డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చడం లేదని, ఎస్ఐఆర్, ఎన్నికల సంస్కరణలపై చర్చకు టైమ్‌లైన్ షరతు పెట్టవద్దని విపక్షాలకు విజ్ఞప్తి చేశారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల తొలిరోజైన సోమవారంనాడు రాజ్యసభలో కిరణ్ రిజిజు మాట్లాడుతూ, అఖిలపక్ష సమావేశంలో విపక్ష పార్టీలు తమ దృష్టికి తీసుకువచ్చిన ఏ అంశాన్ని కూడా తాము తక్కువగా చూడటం లేదని చెప్పారు.

