ఫార్ములా ఈ కారు రేసు కేసులో ఎసిబి విచారణకు మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ హాజరయ్యారు. అంతకుముందు కెసిఆర్ తో కెటిఆర్ సమావేశమయ్యారు. తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. “ఈ కేసును 6 నెలల నుంచి విచారణ చేస్తున్నారు. ఏమీ తేల్చలేదు. 3 సార్లు కాదు.. 30 సార్లు పిలిచినా వస్తాను.అక్రమ కేసులకు భయపడం. లై డిటెక్టర్‌కు కూడా నేను సిద్ధం. చట్టాలు, కోర్టులపై మాకు గౌరవం ఉంది” అని కెటిఆర్ అన్నారు.

