చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున అరంగేట్రం చేసిన న్యూజిలాండ్ పేసర్ జేకబ్ డఫీ, బౌలింగ్‌తో మాయ చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలను పెవిలియన్‌కు పంపి ఆ జట్టును కోలుకోలేని దెబ్బ తీశాడు. అద్భుతమైన స్వింగ్‌తో బ్యాటర్లను తికమక పెట్టిన డఫీ, ఆ తర్వాత ఇన్-ఫామ్ బ్యాటర్ నితీష్ కుమార్ రెడ్డిని కూడా అవుట్ చేసి తన అరంగేట్ర మ్యాచ్‌ను చిరస్మరణీయం చేసుకున్నాడు

