ముస్లిం మహిళ ముఖంపై నుంచి హిజాబ్‌ను బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తొలగించడంపై తీవ్ర వివాదం చెలరేగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎఐఎంఐఎం నేత ఇంతియాజ్ జలీల్ తీవ్ర హెచ్చరిక చేశారు. ఎవరైనా సరే దురుద్దేశంతో ముస్లిం మహిళను తాకడానికి ధైర్యం చేస్తే తాను చెయ్యినరికేస్తానని హెచ్చరించారు. మహారాష్ట్ర లోని జల్నా సిటీలో శుక్రవారం ర్యాలీని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. తాము సెక్యులర్ పార్టీలమని చెప్పుకునే కొంతమంది నేతలు గూండాలకు, నేరాల సంఘటనలపై అనుకూలత చూపిస్తూ ముస్లింలకు మద్దతు ఇవ్వడానికి వెనుకాడుతుంటారని వ్యాఖ్యానించారు.

