మౌంట్ ఎవరెస్ట్‌పై విదేశీ పర్వతారోహకులకు ఇచ్చే ఆహారంలో కావాలనే బేకింగ్ సోడా మోతాదును పెంచి, వారిని అస్వస్థతకు గురిచేస్తారు.వారికి జీర్ణకోశ సమస్యలు మొదలవుతాయి. భయంతో పర్వతారోహకులు అడిగినంత డబ్బు ఇచ్చి హెలికాప్టర్లలో వచ్చి హాస్పిటల్లో జాయిన్ అవుతారు. నకిలీ వైద్య పత్రాలు, తప్పుడు రిపోర్టులు, తారుమారు చేసిన ఫ్లైట్ డాక్యుమెంట్లతో అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి డబ్బులు క్లెయిమ్ చేస్తారు అలా వీరందరూ కలిసి ఇప్పటివరకు 20 మిలియన్ డాలర్ల స్కామ్ చేసినట్టు తాజాగా నేపాల్ పోలీసులు బయటపెట్టారు.

